ఆదివారం గ్రామ సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం
బీపీ, షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ వైద్య సలహాలు ఉచితంగా అందిస్తారు.

ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గాడిలంక గ్రామ సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తారు. బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు సాధారణ వైద్య సలహాలు అందిస్తారు.
పాత ప్రిస్క్రిప్షన్లు, వాడుతున్న మందులు వెంట తీసుకురావాలని, వృద్ధులను తప్పకుండా తీసుకురావాలని నిర్వాహకులు కోరారు.
వ్యాఖ్యలు 1
రాము
మా నాన్నగారిని తీసుకువస్తాను. ధన్యవాదాలు.